ఆసియా కప్ విజేత టీమిండియాకు ట్రోఫీ అందించకపోవడంపై PCB ఛైర్మన్, ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ, BCCI మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ICC బోర్డు సమావేశంలో ఇదే అంశాన్ని BCCI అధికారికంగా లేవనెత్తింది. దీంతో ఈ వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే కమిటీ ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.