NLR: ఇరిగేషన్ శాఖ ఉదయగిరి నియోజకవర్గాన్ని గాలికొదిలేసిందని MLA కాకర్ల సురేశ్ మండిపడ్డారు. 149 ట్యాంకులు ఉన్నా వాటికి కెనాల్స్ సిస్టం లేకపోవడంతో నీరు పోతుందన్నారు. తమ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై ఇరిగేషన్ అధికారులు సమాధానం చెబుతూ జిల్లా వ్యాప్తంగా 446 నీటి ట్యాంకులు మంజూరయ్యాయన్నారు. వీటిలో ఉదయగిరికి మంజూరైన పనులు మేరా చేపడుతున్నట్లు తెలిపారు.