సత్యసాయి: మహిళలు, విద్యార్థినుల భద్రతపై శక్తి టీమ్ పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థినులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, డ్రగ్స్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శక్తి యాప్, డయల్ 100/112 వంటి అత్యవసర సేవల గురించి వివరించారు.