SRPT: మూసీ నదిలో ఈతకు వెళ్లి సుస్మిత (13) అనే బాలిక గల్లంతైన విషాద ఘటన నేరేడుచర్ల మండలం సోమారంలో శనివారం జరిగింది. గ్రామంలోని సోమప్ప సోమేశ్వరాలయం వెనుక ఉన్న నదిలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లగా, సుస్మిత నీట మునిగింది. మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన బాలిక కోసం రెస్క్యూ టీంను రంగంలోకి దించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.