ప్రకాశం: లోన్ రికవరీ ఏజెంట్లు RBI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డీఎస్పీ సాయి ఈశ్వర్ యస్వంత్ సూచించారు. శనివారం కనిగిరి సబ్‌డివిజన్ పరిధిలోని ఏజెంట్లకు పాటించాల్సిన నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. RBI మార్గదర్శకాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రుణ వసూళ్ల సమయంలో ఖాతాదారులను ఇబ్బంది పెట్టవద్దన్నారు.