NDL: కొలిమిగుండ్ల మండలం కలవటాల గ్రామ సమీపంలో ఉన్న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో ఇవాళ ప్రమాదవశాత్తు నక్క ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ నక్క ప్రసాద్ ట్యాంకు పైకి ఎక్కి కప్పు మూసే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందకు పడ్డాడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపే మృత్యువాత పడ్డాడినట్లు వారు తెలిపారు.