GDWL: రాజోలి మండల కేంద్రంలోని ఆర్డీటీ కాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంటిని రేణుక శివశంకర్ దంపతులు అద్దెకు తీసుకొని ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రలో ఉన్నారు. సాయంత్రం ఇంట్లో నుంచి వచ్చి చూడగా ఇంటి గేటు ముందు ఒక బొమ్మపై పసుపు, కుంకుమ పడి ఉండడం చూసి హడలెత్తిపోయామని వారు అన్నారు.