ELR: పిప్పర జడ్పీ హైస్కూల్లో ఇవాళ ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ఎస్టీయూ రూపొందించిన బుక్‌లెట్‌ను అందజేశారు. కె. శ్రీనివాసరావు, జి. రామాంజనేయులు రూల్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.ఎస్. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.