HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఇప్పటివరకు 46 శాతం మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూలై నాటికి 100% పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ. 714 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈమేరకు తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, RPF భవనం, స్టేషన్కు తూర్పు వైపు ఒక ఫుడ్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్ ఫారం షెల్టర్, పార్కింగ్ షెడ్డులను పూర్తి చేశారు.