ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. మనిషి శారీరకంగానే కాక మానసికంగా దృఢంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రాణాయామం అంటే శక్తిని మేల్కొల్పడం అని యోగా నిపుణులు చెబుతున్నారు. ప్రాణాయామం చేస్తే మనలో ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. రోజూ చేస్తే శరీరం తేలిగ్గా మారుతుంది. ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక సమస్యలను ప్రాణాయామంతో తగ్గించుకోవచ్చు.