VSP: మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న విశాఖలో జరిగింది. గోపాలపట్నం పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌కు చెందిన T.రమ ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. తన భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మారలేదు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయిందని వెల్లడించారు.