KRNL: సి. బెలగల్లోని ఎంపీపీ పాఠశాలను స్పెషల్ ఎంఈవో జ్యోతి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. పాఠశాలలో పలు రికార్డులను, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని వంట ఏజెన్సీలను హెచ్చరించారు. విద్యార్థులలో పఠన నైపుణ్యాన్ని పరిశీలిన్నట్లు తెలిపారు.