NLR: సంగంలోని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను శనివారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ వేమారెడ్డి మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేయాలని, వాహనాలకు అన్ని పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.