ELR: యువతకు ఉద్యోగ కల్పన కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. ఆగిరిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈనెల 11 మంగళవారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా జరుగుతుందన్నారు. జిల్లా నుంచి ఏ ప్రాంతం వారైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 10వ తరగతి నుంచి తదితర చదువుల్లో పాసైన 18-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులని తెలిపారు.