ELR: వట్లూరు- ఏలూరు రైల్వే స్టేషన్ మధ్య లెవెల్ క్రాసింగ్ నెంబరు 347 (486/26-28) కి.మీ. వద్ద అత్యవసర మరమ్మతుల పనులు చేపడుతున్నామని రైల్వే శాఖ అధికారులు శనివారం తెలిపారు. దీంతో ఈనెల 10 ఉదయం 7 గంటల నుంచి 19 సాయంత్రం 5 గంటల వరకు ఏలూరులోని పవర్ పేట రైల్వే గేట్లను మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాణికులు వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలలో వెళ్లాలన్నారు.