E.G: కొవ్వూరులోని గోదావరి మాత విగ్రహం వద్ద ఉన్న సీతారామ స్నానఘట్టం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శనివారం సాయంత్రం లభ్యం కావడంతో స్థానికులు భయాందోళన చెందారు. స్థానికుల సమాచారం మేరకు కొవ్వూరు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.