WNP: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలింగ్ రోజు అనుసరించాల్సిన అంశాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బూత్ ఇన్ఛార్జ్లకు 152, 160 బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. నిన్న రాత్రి ఆయన మాట్లాడుతూ.. దౌర్జన్యాలకు భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 48 గంటలు ఎంతో విలువైనవి అని 20 రోజులుగా ప్రచారంలో పడ్డ శ్రమను ఓట్ల రూపంలో మలుచుకోవాలని సూచించారు.