TG: సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే బీజేపీపై నిందలు వేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రేవంత్ మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్, BRS చెట్టాపట్టాలు వేసుకుని అధికారాన్ని పంచుకున్నాయని ఆరోపించారు. 20% ఓట్ల కోసం దిగజారి మాట్లాడితే 80% ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.