KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేత తుమ్మల యుగంధర్ చేతుల మీదుగా ఈ చెక్కులను ఖమ్మం నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, మండల నాయకులకు అందజేశారు. నాయకులు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేయాలని యుగంధర్ కోరారు.