NLR: ఉలవపాడు మండలంలోని చాకిచర్ల పెద్ద పట్టపుపాలెంకు చెందిన యువకుడు శనివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అయితే SI అంకమ్మ తెలిపిన వివరాలు ప్రకారం..పెదపట్టపుపాలెంకు చెందిన వాయిల చంద్రయ్య, ఆయన కుమారుడు రాజు ఉదయం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. అనంతరం వేట ముగించుకుని తిరిగి వస్తుండగా సముద్రపు అలల ధాటికి బోటు తిరగబడిందని తెలిపారు.