MHBD: పెద్దవంగర మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ పరిసరాల్లో శనివారం ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని ఆయన పేర్కొన్నారు. గ్రామాలు, దుకాణాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతానాలకు తావులేకుండా ఉంటుందన్నారు.