MBNR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో జిల్లా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు ప్రజలు తమ విలువైన ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు.