W.G: జిల్లా గ్రామ పంచాయితీల్లో అమలు చేస్తున్న స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో 967 ఇంటి పన్నులకు ఒకే ఫోన్ నంబర్ నమోదు చేసినందుకు ఓ అధికారిని సస్పెండ్ చేశారు. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు గాను వేములదీవి కార్యదర్శి పి.ఏసు ప్రకాశ్‌ను అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందినట్లు పంచాయతీ విస్తరణాధికారి పేర్కొన్నారు.