WNP: జిల్లాలో బాల్యవివాహాలు, బాల కార్మికుల నిర్మూలనపై ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సోషల్ మొబిలైజర్ కే. దివ్య భారతి కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట ఎస్డీఎం కళాశాలలో విద్యార్థులచే ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి విజయకుమార్, స్వర్గ స్వామి, తదితరులు పాల్గొన్నారు.