ఖమ్మం జిల్లా పాతర్లపాడు గ్రామంలో సామినేని రామారావు సంస్మరణ సభ శనివారం నిర్వహించారు. సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొని రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. రామారావును హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.