W.G: తాడేపల్లిగూడెం మండలం చిన తాడేపల్లి ఎస్సీ ఏరియా సమీపంలో మగ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు రూరల్ పోలీసులు శనివారం పేర్కొన్నారు. VRO ఎం. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి సుమారు వారం రోజులు వయస్సు ఉంటుందని భావిస్తున్నట్లు తెలియాజేశారు. ఈ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.