RR: మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పీఎస్లో శనివారం ఫిర్యాదు చేశారు. గత జూన్లో గోపీనాథ్ ఆకస్మిక మృతితోనే ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆమె ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం BRS తరఫున గోపీనాథ్ భార్య సునీత బరిలో ఉన్నారు.