ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలం లింగన్న పల్లికి ఇవాళ కొండేపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి రానున్నారు. ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు రానున్నారు.