ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు. ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. దానిమ్మ గింజల రసంలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి.. సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. రోజూ ఉదయం చక్కెర కలపని దానిమ్మ రసం ఒక గ్లాస్ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.