MDK: జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన రాజీ కాదగిన కేసుల్లో స్పెషల్ లోక్ అదాలత్ లో 503 కేసుల్లో రాజీ జరిగినట్లు జిల్లా ఎస్పీ డివీ శ్రీనివాసరావు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించిన 41 కేసుల్లో రికవరీ చేసిన రూ. 11,44,608 డబ్బును బాధితుల ఖాతాలో జమ చేసినట్లు వివరించారు.