NRPT: ఊట్కూర్ మండలంలోని వల్లంపల్లిలో శనివారం పోలీసులు అక్రమంగా మొరం తరలిస్తున్న టీజీ 38 టి 0152 నంబర్ టిప్పర్ను పట్టుకున్నారు. డ్రైవర్ బి. శ్రీకాంత్ వద్ద అనుమతి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి, టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మొరం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.