ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు CM రేఖాగుప్తా తెలిపారు. కాలుష్య తీవ్రత ప్రమాదస్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోం చేయాలని ఆదేశించారు. ప్రజలంతా ప్రజా రవాణాను ఉపయోగించాలని, కార్ పూలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.