ATP: గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 మద్యం దుకాణాలకు రీ-నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఉమాదేవి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరటి కొండ, కొత్తపేట, పామిడి, మిడుతూరు గ్రామాలలో మద్యం దుకాణాలకు రీ-నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తిరిగి 12వ తేదీన లాటరీ తీస్తామని పేర్కొన్నారు.