ప్రకాశం: ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి శనివారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మొత్తం 41 మంది ఫిర్యాదుదారులు ఫోన్ కాల్ ద్వారా ఎస్పీకి తమ సమస్యలను వివరించారు. వాటిపై సంబంధిత పోలీసు అధికారులకు తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుని భాధితులకు న్యాయం అందించాలన్నారు.