BHPL: కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాల విద్యార్థులు చంటి, అజయ్ రాష్ట్రస్థాయి అండర్-17 హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో వరంగల్ జట్టు తరఫున ఆడేందుకు ఎంపికయ్యారు. ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారని వరంగల్ SGFI భూపాలపల్లి జిల్లా కార్యదర్శి జైపాల్ ఇవాళ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు అభినందించారు.