ప్రకాశం: కనిగిరిలోని స్థానిక ఐస్ పార్లర్ సెంటర్లో బేతంశెట్టి మల్లయ్య అనే వ్యక్తి పండ్లు కొనుగోలు చేస్తూ తన హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మర్చిపోయి వెళ్లిపోయారు. దీంతో పండ్ల వ్యాపారి గౌస్ భాషా ఆ బ్యాగును పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. కాగా, బ్యాగులో ఏడు లక్షల విలువ చేసే వస్తువులు ఉన్నాయని, దీంతో పోలీసులు బ్యాగును మల్లయ్యకు అప్పచెప్పారు.