బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పీ ఉమామహేశ్వర్ భక్త కనకదాసు జయంతిని నిర్వహించారు. ఎస్పీ కనకదాసు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. తత్వ జ్ఞానాన్ని సామాన్యులకు అర్థం అయ్యేలా సంగీతం, సాహిత్యంతో తన జీవితాన్ని అంకితం చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.