TPT: వడమాలపేట శ్రీభవాని శంకర దేవాలయం పుష్కర కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడిపి నాయకులు, కార్య కర్తలు, భక్తులు పాల్గొన్నారు.