NLG: మునుగోడుకు చెందిన అన్వర్ మత సామరస్యాన్ని చాటారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప మాలధరించిన స్వాములకు అన్నదానం చేశారు. దేశంలో మత సామరస్యం పెంపొందించాల్సిన అవసరముందన్నారు. మానవత్వమే మనిషికి మతమని, ఇటువంటి కార్యక్రమాలు ఐక్యతను చాటి చెప్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.