WGL: పర్వతగిరి మండలం మాల్యా తండా, ఏనుగల్ చౌటపల్లి గ్రామాల్లో IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ సత్య శారద శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. రైతులు తమ పంట ధాన్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని, ఏదైనా ఇబ్బందులు ఎదురైనా ఉన్నతాధికారులకు తెలియజేయమని సూచించారు.