TPT: చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి దశమ వార్షికోత్సవ మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆమెకి అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ముత్యాలమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.