GNTR: ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నా శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు చిన్నా అసైన్డ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని గ్రామాల్లోని అసైన్డ్ రైతుల ప్లాట్లు పెండింగ్లో ఉన్నాయని, వాటితో పాటు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.