GNTR: కొల్లిపర మండలం సిరిపురం శివారు బస్‌స్టాప్ వద్ద శనివారం తెనాలి నుంచి ప్రయాణికులతో వస్తున్న ఒక ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. సిరిపురం, శివలూరు గ్రామాలకు చెందిన పలువురు ప్రయాణికులకు చేతులు విరిగినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.