SRCL: ఇల్లంతకుంట మండలం రేపాక బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మండల స్థాయి కబడ్డీ పోటీలలో ఇల్లంతకుంట కబడ్డీ టీం రేపాక టీంపై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం. రాజు రూ. 5,016 రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి అన్ని రంగాలలో రాణించాలని ఆయన కోరారు.