NTR: విజయవాడ నగరపాలక సంస్థ, జోనల్ కార్యాలయాలు, సచివాలయాలలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని వీఎంసీ కమిషనర్ ధ్యాన్చంద్ర తెలిపారు. తమ సమస్యలను అధికారులకు తెలియపరచడానికి అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.