KRNL: వెల్దుర్తి మండలం మాధాపురం బస్టాండ్లో శనివారం పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గోవర్ధనగిరికి చెందిన ఎరుకల లక్ష్మన్న గంజాయి తీసుకుని వెళ్తుండగా సీఐ యుగంధర్, ఎస్సై నరేశ్ సంయుక్తంగా సోదాలు జరిపి అతనిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి స్వాధీనం తీసుకొని కేసు నమోదు చేశారు. అక్రమంగా గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.