ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల దృష్ట్యా ఇస్లాంపేట, అద్దంకి బస్టాండ్, గానుగపాలెం, గోపాలనగర్, గుంటూరురోడ్డు, నవభారత్ ఎదురు, కబేళా బజారు, బాపూజీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలకు ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ పాండురంగారావు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.