ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య విషయంలో భారత్‌ను ఉద్దేశిస్తూ కెనడా మాజీ ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, బ్రిటిష్ నిఘా సంస్థ కొందరి కాల్స్‌లోకి చొరబడి సేకరించిన సమాచారాన్ని కెనడాకు అప్పగించింది. నిజ్జర్ హత్య కేసు వివరాలను బ్రిటన్ అధికారులు కెనడాకు ఇచ్చినట్లు తెలిసింది.