NZB: మొన్నటి వరకు వర్షాలతో పైరు ఆగం కాకుండా కాపాడుకున్న రైతులకు.. ఇప్పుడు పంటను అమ్ముకుందామంటే దళారులు కన్నేశారు. ధర తగ్గించి దోపిడీ చేస్తున్నారు. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇటీవల ప్రారంభించింది. అయినా కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు. కొన్న మక్కలకు నగదు ఇవ్వడం లేదు. యాసంగి పెట్టుబడికి ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.