SRD: ఉపాధి హామీ పథకం భాగంగా సోమవారం మండల కేంద్రమైన కంగ్టిలో 15వ విడతన నిర్వహించిన సామాజిక తనిఖీపై ప్రజా వేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపిడివో సత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు నిర్వహించిన పనులపై సామాజిక తనిఖీ చేసినట్లు చెప్పారు. మండలంలో గత నెల 26 నుంచి 9 వరకు సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ చేశారు.